MHBD: మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం గ్రామ శివారు ఆకేరువాగు సమీపంలోని గంగమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత ధర్మకర్త నూకల అభినవ్ రెడ్డి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మతల్లి దీవెనలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు గంగమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.