జగిత్యాల ఫస్ట్ అదనపు సెషన్స్ జడ్జి సునీత రవీందర్ రెడ్డి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గురువారం ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో జడ్జి దంపతులను ఆహ్వానించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి సాక్షిగా బాధ్యతలు చేపట్టారు. ఆలయ స్థానాచారి కపిందర్ వారికి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.