SRD: మండల కేంద్రమైన కంగ్టి ఎంపీపీఎస్ పాఠశాలలో మండలంలోని ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. గ్రాడ్యుయేషన్ గౌన్లు ధరించిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఉపాధ్యాయులు కిఫాయత్ అలీ, తదితరులు ఉన్నారు.