BHNG: ప్రజాపాలనలో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆలేరు మండలం శారాజీపే గ్రామ సర్పంచ్ కంటి మధు అన్నారు. గురువారం తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంటి మధు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.