KMM : ఏన్కూర్ మండలంలో ఎస్ఎంఏఎం పథకం కింద లబ్ధిదారులకు అందజేసిన వ్యవసాయ యంత్రాలను బుధవారం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వైరా ఏడీఏ టి.కరుణశ్రీ, ఏవో నరసింహారావు గ్రామాల్లో పర్యటించి రోటోవేటర్లు, తైవాన్ పంపులు, స్ట్రా బల్లర్ల పనితీరును తనిఖీ చేశారు. యంత్రాల వినియోగంపై రైతులకు పలు సూచనలు చేశారు.