BDK: బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో డా. బిఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ సమసమాజ నిర్మాణంలో ఆయన పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించారు.