GDWL: జిల్లా కేంద్రంలోని గంటవీధి కాలనీలో ప్రజా మరుగుదొడ్లకు సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. లక్షల ప్రజాధనం వెచ్చించినా, అపరిశుభ్రత వల్ల వాడుకలోకి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వాటిని మరమ్మతు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.