వనపర్తి: వీపనగండ్లలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా సర్వే నెంబర్ 721 ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు పార్టీలకతీతంగా నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేసి, హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.