AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఏప్రిల్ 8 తమ కుటుంబానికి ఎంతో ఎమోషనల్ రోజు అని తెలిపింది. ఇవాళ అకీరా నందన్ పుట్టినరోజు కావడం విశేషం. మరోవైపు, గతేడాది ఇదే రోజున తన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడటం తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మార్క్ కోలుకోవడంతో, ఒకేరోజు ఇద్దరి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నట్లు ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.