WGL: నర్సంపేట రూరల్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా గురజాల సర్పంచ్ బండారి చందర్రావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్లందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు.