KNR: అమరవీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్వ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వీణవంక మండలం చల్లూరులో వీరి 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్ పాల్గొన్నారు.