ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, వరి, ఆముదం పంటలు దెబ్బతిన్నాయని మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫిక్ సోమవారం తెలిపారు. మండలంలో సుమారుగా 495 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రాథమిక నష్టం నివేదిక అంచనాలపై అధికారులకు పంపడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.