NRPT: కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు నారాయణపేట అంబేద్కర్ కూడలిలో నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని ఆందోళన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.