WGL: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి (DPRO)గా నూతనంగా నియమితులైన బి.ప్రేమలత, హనుమకొండ నక్కలగుట్టలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రేమలత కలెక్టర్కు మొక్కను బహూకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరే విధంగా కృషి చేస్తానని తెలిపారు.