గద్వాల జిల్లాలోని 41 ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ విజయలక్ష్మి గురువారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 8వ తేదీ లోపు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్, ఆయాకు 7వ తరగతి అర్హత, 18-44 ఏళ్ల వయస్సు ఉండాలన్నారు. ఇవి 10 నెలల గౌరవ వేతన తాత్కాలిక నియమాకాలని పేర్కొన్నారు.