MHBD: కొత్తగూడ మండలం కిష్టపురం గ్రామానికి చెందిన భూర్క ప్రవీణ్ కుమార్ బ్యాంకు పనిపై సోమవారం మహబూబాబాద్‌కు వచ్చి వెళ్తున్న క్రమంలో జామాండ్ల పల్లి వద్ద ఆటోను ఢీ కొనడంతో తలకు బలమైన గాయాలు తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు108 సమాచారంను అందించగా వారు ప్రథమ చికిత్సను అందించి మెరుగైన వైద్యచికిత్సకై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.