VKB: బంట్వారం మండల కేంద్రంలో ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విమల మాట్లాడుతూ.. వాహనదారులు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. టీనేజీ యువకులు రోడ్డు ప్రమాదాలకు అధికంగా గురవుతున్నారని సూచించారు.