SRPT: నూతనకల్ మండలంలోని మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ మాతృమూర్తి ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న తుంగతుర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి సోమవారం వారి నివాసానికి చేరుకుని, మృతురాలి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.