NLG: విద్యుత్ పొదుపు చేయాలని సూచించే అధికారులే విద్యుత్ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇవాళ చిట్యాల MRO ఆఫీస్లో పగటిపూట కూడా లైట్లు వెలుగుతూనే ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కనీసం స్విచ్ ఆఫ్ చేసే బాధ్యత కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు నీతులు చెప్పే ప్రభుత్వ ఆఫీస్లో ఇలా జరగడం విస్మయం వ్యక్తం అవుతుంది.