NLG: నల్లగొండ నగర శివారు ప్రాంతాలైన వినాయక హౌసింగ్ బోర్డ్, కతాల్‌గూడ, రామ్ నగర్, మర్రిగూడ తదితర ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు. బుధవారం ఆర్టీసీ అధికారులకు ఆయన వినతి పత్రం ఇచ్చారు. బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు, కూలీలు ఇబ్బంది పడుతున్నారని, రిక్వెస్ట్ స్టాప్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.