NRML: నిర్మల్ జిల్లాలో సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు అందజేసి రూ.8.18 కోట్ల లావాదేవీలకు సహకరించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేశ్వరం, సోన్ మండలాలకు చెందిన నిందితులపై మరింత విచారణ కొనసాగుతోంది. ప్రజలు తమ బ్యాంకు వివరాలను ఇతరులకు ఇవ్వొద్దని ఎస్పీ జానకి షర్మిల గురువారం సమావేశంలో హెచ్చరించారు.