KDP: జిల్లా ఆర్యవైశ్య సంఘం (రూరల్) అధ్యక్షుడిగా బద్వేల్ పట్టణానికి చెందిన వల్లంకొండు వెంకటరమణ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రకటించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని వెంకటరమణ తెలిపారు.