వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణకు కాచి చల్లార్చిన నీటిని తాగడం ఎంతో శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి రోజువారీ ఆహారంలో అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు చేర్చుకోవాలి. దోమలు ప్రబలకుండా పరిసరాలను పొడిగా ఉంచుకోవాలి. తాజా, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగై, ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.