AP: కర్ణాటకలోని తుమకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మైసూరు నుంచి ఆదోని వస్తుండగా ఇన్నోవా, ఓమ్ని ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భర్త గజేశ్వర్రెడ్డి, భార్య ఇందిర, కుమార్తె సౌమ్య మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.