KNR: కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన చేపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు విమర్శించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ కె. లక్ష్మీ కిరణ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.