HNK: వనమాల కనపర్తి గ్రామంలో ఉపాధి హామీ పనులను స్థానిక సర్పంచ్ రిపిక ఎల్లస్వామి ప్రారంభించారు. ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పనులు చేసే వద్ద ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈజీఎస్ సిబ్బందికి సర్పంచ్ సూచనలు చేశారు. ఉపసర్పంచ్ నోముల కుమార్, 4వ వార్డు సభ్యుడు వినయ్, తదితరులు ఉన్నారు.