ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు ఆస్తి పన్నులు, నీటి పన్నులు, వ్యాపార లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ గజానంద్ సూచించారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని శనివారం ఆయన కోరారు. పట్టణ అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే పన్నుల వసూలు కీలకమని తెలిపారు. ప్రజలు సహకరించి మున్సిపాలిటీ సేవల మెరుగుదలకు తోడ్పడాలని కోరారు.