MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వానికి మధ్య చర్చలు విప్పడం కావడంతో కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ అధికారులు ప్రైవేటు బస్సులను నడిపించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు డ్రైవర్లకు చెయ్యెత్తి దండం పెడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.