మహబూబాబాద్ పట్టణంలో వాహనదారులకు పెట్రోల్ కొరత సమస్య మొదలైంది. పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోల్ నిల్వలు తక్కువగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ బంకులవద్ద చేరిన వాహనదారులు ‘నో స్టాక్’ బోర్డులు చూడాల్సి రావడంతో, వారు వెనుతిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అధికారుల వెంటనే స్పందించి పెట్రోల్ సరఫరా పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.