HYD: ప్రభుత్వం మూసీ నది పరీవాహక ప్రాంతమైన మంచిరేవుల (గండిపేట) వద్ద నూతనంగా ఓంకారేశ్వర మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 28న ఉదయం 8:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆలయ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో దాతలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈఅద్భుత ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించనున్నారు.