MHBD: నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి SI సురేష్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. SI మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, శాంతి భద్రతల పరిరక్షణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.