భారత్లో ఇంధన సరఫరాకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది. ఈ మేరకు భారత రిఫైనరీలు రష్యా నుంచి దాదాపు 60 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది వచ్చే నెలలో డెలివరీ కానున్నట్లు బ్లూమ్బర్గ్ తన కథనంలో పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ ధర కంటే బ్యారెల్కు 5-15 డాలర్లు అధికంగా చెల్లించి భారత రిఫైనరీలు ఈ చమురును బుక్ చేసినట్లు తెలిపింది.