SRCL: ప్రజలకు భద్రత మెరుగైన సేవలు అందించేందుకు నూతన పోలీస్ స్టేషన్ ఎంతో కీలకమని కలెక్టర్ గరీమ అగర్వాల్ స్పష్టం చేశారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించామని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ, అధికార యంత్రాంగంతో కలిసి ఇటీవల జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, మహా శివరాత్రి జాతర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించామని గుర్తు చేశారు.