KNR: శంకరపట్నం మండలంలోని ఆర్కండ్ల, కన్నాపూర్, కాచాపూర్, ఇప్పలపల్లి గ్రామాలను 2024 సంవత్సరానికి ‘టీబీ ముక్త్’ పంచాయతీలుగా ప్రభుత్వం గుర్తించింది. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఎంపీడీవో కృష్ణప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ శ్రావణ్ కుమార్ నాలుగు గ్రామాల సర్పంచులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు.