SRPT: కోదాడ ఆర్టీసీ డిపోలో మూడో రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మెకు కోదాడ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఈరోజు సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా ఆ ఆసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, కార్మికుల సమ్మెకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.