ADB: బోథ్ మండల కేంద్రానికి చెందిన మేడిపల్లి లక్ష్మికి మంజూరైన రూ.31,500 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును సోమవారం మండల BRS నాయకులు అందజేశారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బాధితురాలికి ఈ ఆర్థిక సాయం అందించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారురాలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.