SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవికాలం ప్రారంభం కావడంతో బోర్లలో నీరు అందక వరి పొలాలు నెర్రలు బారుతున్నాయి. భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరుకోగా, సాగునీరు అందకపోవడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో పలువురు రైతులు చేసేదేమీ లేక పశువులకు మేతగా వదిలేస్తున్నారు.