NRPT: మక్తల్ మండలంలోని మంథన్‌గోడ్-జక్లేర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నిర్మాణం నాణ్యతతో ఉండేలా, పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. ఈ వంతెనతో రాకపోకలు సులభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్ గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.