BDK: అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కు పాదం మోపాలని ఎస్పీ రోహిత్ రాజు చండ్రుగొండ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారి, స్టేషన్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విధానాలను అలవర్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.