NLG: చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డులో ప్రమాదకరంగా ఉన్న పెద్ద మోరీపై కప్పులు వేయాలని కోరుతూ స్థానికులు భారీ నిరసన చేపట్టారు. మోరీలో పడి ఇప్పటికే పలువురు గాయపడగా, కొందరు ప్రాణాలు కోల్పోయారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వీడి నెలలోపు కప్పులు వేయకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.