JGL: జగిత్యాలలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగపుత్ర భీష్మ క్రికెట్ టోర్నీ సీజన్-2 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ సమిండ్ల వాణి ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందిస్తాయని అన్నారు. ఈ టోర్నీ యువత ప్రతిభను వెలికితీసే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. జట్లకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.