SRD: పటాన్ చెరు డివిజన్ బండ్లగూడలో సౌత్ సెంట్రల్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణలో భాగంగా ట్రాక్‌కు ఇరువైపుల 50 మీటర్లలోని కట్టడాలపై సర్వే జరిగింది. ఇళ్లను తొలగిస్తారేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు అన్యాయం జరగకుండా ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో మాట్లాడతామని మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు.