NRPT: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4న నారాయణపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వినీత్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళవారం ఆయన మక్తల్ పట్టణ శివారులో సీఎం ల్యాండింగ్ కోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్‌ను పరిశీలించారు. అనంతరం కాట్రేవ్ పల్లి వద్ద జరుగుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల ప్రాంతాన్ని సందర్శించారు.