MDCL: ప్రగతినగర్లో 9 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ కల్పించింది. అంబీర్ చెరువుకు ఆనుకుని ఉన్న 5 ఎకరాల స్మశానవాటిక, పక్కనే ఉన్న 4 ఎకరాల డంపింగ్ యార్డు స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయనే ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూకట్పల్లి మండలం బాగామేరి గ్రామం సర్వే నం.103లో ఉన్న ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు.