హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ సహజమైన పీచు, ఉన్నితో ప్రత్యేక పాదరక్షలను తయారు చేసి విక్రయిస్తోంది. ఇవి పర్యావరణహితంగా ఉండటమే కాక.. చెమట పట్టినా దుర్వాసన రాకుండా త్వరగా ఆరుతాయని సంస్థ ప్రతినిధి సంతోష్ తెలిపారు. శీతోష్ణస్థితికి అనుగుణంగా పాదాలను వెచ్చగా లేదా చల్లగా ఉంచే ఈ చెప్పులు, ప్రస్తుతం విజయవాడలోని ప్రదర్శనలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.