సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రధాన జాతీయ రహదారులు, ప్రమాదకర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై నిఘా ఉంచారు. వాహనదారులు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.