NTR: విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల పంటలకు జరిగిన నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యవసాయ,ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ తుది నివేదికల ఆధారంగా పరిహారం అందజేస్తామన్నారు.