PDPL: రామగుండం సింగరేణి సంస్థ జీడికే-1 గని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన RO నీటి శుద్ధి కేంద్రాన్ని శుక్రవారం జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు. వేసవి కాలంలో విధులు నిర్వహించే కార్మికులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు పొందిన కార్మిక సంఘ నాయకులు, అధికారులు రమేష్, సురేష్ పాల్గొన్నారు.