రణ్వీర్ సింగ్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. సెన్సార్ సమస్యలు, సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిన షోలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రణ్వీర్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.