AP: చిత్తూరు(D) యాదమరి(M) చిన్నరెడ్డిపల్లి క్రాస్ సంత వద్ద సిలిండర్ల కోసం లబ్ధిదారులు బారులుదీరారు. ఈ వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజులుగా సిలిండర్ల సరఫరా సరిగా లేదని, గంటల తరబడి వేచి చూసినా అందలేదని పలువురు వాపోయారు. అయితే, సిలిండర్ల కొరత లేదని బుక్ చేసుకున్నవారికి OTP వస్తుందని, OTP చెబితే పంపిణీ చేస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన విషయం తెలిసిందే.